Y.S.SUNITHA: హంతకులకు ఓటు వేయకండి

Y.S.SUNITHA: హంతకులకు ఓటు వేయకండి
ఆంధ్రప్రదేశ్‌ ఓటర్లకు డాక్టర్‌ సునీతరెడ్డిత విజ్ఞప్తి.... అవినాష్‌రెడ్డిని ఓడించడమే తన లక్ష్యమన్న సునీత

హంతకులకు ఎట్టిపరిస్థితుల్లోనూ ఓటు వేయవద్దని వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్‌ సునీతరెడ్డి ఆంధ్రప్రదేశ్‌ ప్రజలను కోరారు. తన తండ్రిని హత్య చేసిన వారిని ముఖ్యమంత్రి జగన్ కాపాడుతున్నారని ఆక్రోశం వ్యక్తం చేశారు. అవినాష్‌రెడ్డిని ఓడించడమే తన లక్ష్యమని సునీత తేల్చిచెప్పారు. తన వెనుక ఏ రాజకీయ పార్టీ లేదని..తన పోరాటం కేవలం న్యాయం కోసమేనని స్పష్టం చేశారు. వైఎస్ వివేకానందరెడ్డిని హత్య చేసిన వారు దర్జాగా బయట తిరుగుతుంటే వ్యవస్థలు ఏమీ చేయలేకపోతున్నాయని..ఆయన కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. YS రాజశేఖర్‌ రెడ్డి మరణం తర్వాత తన కుటుంబంలో జరిగిన రాజకీయ పరిణామాలను హైదరాబాద్ బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో పవర్ పాయింట్ ప్రజేంటేషన్ ద్వారా వివరించారు. హంతకులు అధికారంలో ఉంటే ఎప్పటికీ న్యాయం జరగదన్నారు.


సీబీఐ కేసుల్లో జగన్ జైల్లో ఉండగా షర్మిల వైసీపీని భుజాన వేసుకుని తన పిల్లలను వదిలేసి రోడ్లపై తీరిగి పార్టీని నడిపించిందని సునీతా గుర్తు చేశారు. 2014 ఎన్నికల్లో కడప నుంచి ఆమె పోటీ చేస్తారని అందరూ భావించినా..ఆ స్థానాన్ని జగన్... అవినాష్ రెడ్డికి ఇచ్చారన్నారు. అవినాష్ రెడ్డికి టికెట్ ఇచ్చినా ఆయన గెలుపు కోసం వివేకా పనిచేశారని..ఆ తర్వాత వెన్నుపోటు రాజకీయాలు మొదలయ్యాయన్నారు. తన కుటుంబంలోని వారే వివేకాను హత్య చేశారంటే..తానూ మొదట నమ్మలేదని..సునీతారెడ్డి చెప్పారు. వారిని సంపూర్ణంగా విశ్వసించడం తాను చేసిన పొరపాటన్నారు. వివేకా హత్య కేసులో తన లక్ష్యం ప్రతీకారం తీర్చుకోవడం కాదని న్యాయం కోసం పోరాడుతున్నట్లు సునీతారెడ్డి చెప్పారు.

‘‘కొద్దిరోజులకే సీబీఐ కేసుల్లో జగన్‌ అరెస్టయి జైలులో ఉన్నారు. షర్మిల పార్టీని భుజాన వేసుకుని నడిపించింది. జగన్‌ వెంట వచ్చిన ఎంపీలు, ఎమ్మెల్యేల రాజీనామా తర్వాత వచ్చిన ఉప ఎన్నికల్లో షర్మిల ప్రచారం చేసి గెలిపించారు. ఉప ఎన్నికల్లో విజయం తర్వాత షర్మిలకు ఆదరణ వస్తోందని పక్కనపెట్టారు. 2014 ఎన్నికల్లో కడప నుంచి ఆమె పోటీ చేస్తారని అందరూ భావించారు. అయితే.. ఆ స్థానాన్ని అవినాష్‌ రెడ్డికి ఇవ్వాలని నిర్ణయించారు. ఇది వివేకాకు ఇష్టం లేదు. ఆ తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకా ఓటమిపాలయ్యారు. అవినాష్‌ కుటుంబం వెన్నుపోటుతో ఆయన ఓటమిపాలైన విషయం స్పష్టమైంది. నా కుటుంబంలోని వారే వివేకాను హత్య చేశారని నేను మొదట నమ్మలేదు. వారిని సంపూర్ణంగా విశ్వసించడం నేను చేసిన పొరపాటు’’ అని ఆమె అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story