BJP: బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా ఈటల!

BJP: బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా ఈటల!
అమిత్‌ షాతో ఈటల భేటీతో పెరిగిన ఊహాగానాలు... ఇప్పటికే హామీ కూడా వచ్చేసిందన్న వార్తలు

బీజేపీ అగ్రనేత, కేంద్ర మంత్రి అమిత్ షాను మల్కాజ్ గిరి MP ఈటల రాజేందర్ మర్యాదపూర్వకంగా కలిశారు. కేంద్ర మంత్రిగా ప్రమాణం చేయడంతో అమిత్ షాకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ భాజపా అధ్యక్షుడిగా ఈటల రాజేందర్ ను నియమించే అవకాశం ఉందన్న ఊహాగానాల నడుమ ఇరువురి భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. కేంద్ర మంత్రి పదవి ఆశించిన ఈటలకు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. పశ్చిమ బెంగాల్, తెలంగాణ భాజపా రాష్ట్ర అధ్యక్షులను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకోవడంతో.... ఈ రెండు రాష్ట్రాలతో పాటు మరికొన్ని రాష్ట్రాల అధ్యక్షులను మార్చే యోచనలో అధిష్టానం ఉంది. ఇప్పటికిప్పుడు మారుస్తుందా లేక సంస్థాగత బలోపేతం తరువాత మారుస్తారా అనేది రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది.


కిషన్‌రెడ్డి స్థానంలో భాజపా తెలంగాణ అధ్యక్షుడిగా కొత్త వారిని నియమించవచ్చని తెలుస్తోంది. ఈటలతోపాటు కొత్త పేర్లు కూడా పరిశీలించే వీలుందని పలువురు నేతలు విశ్లేషిస్తున్నారు. బండి సంజయ్‌ ఇప్పటికే జాతీయ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తుండటం.. తాజాగా కేంద్ర మంత్రి అయిన నేపథ్యంలో ఒక పదవికే పరిమితం చేస్తారని చర్చ నడుస్తోంది. మరోవైపు అమిత్‌షాను ఈటల రాజేందర్‌ కలిశారు. కేంద్ర మంత్రిగా ప్రమాణం చేసిన ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. తాజా పరిణామాల నేపథ్యంలో వీరి భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది.

మరోవైపు 2047లో భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి ప్రధాని నరేంద్ర మోదీ దృఢ సంకల్పంతో పనిచేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రైతులు, వ్యవసాయ రంగం అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన స్పష్టంచేశారు. అటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా ఏ రాష్ట్రం పట్ల వివక్ష తమకు లేదని కిషన్ రెడ్డి వెల్లడించారు. రాజకీయాలకతీతంగా తెలంగాణ అభివృద్ధే లక్ష్యంగా పనిచేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని కేంద్రమంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. రాష్ట్రప్రభుత్వం సహా అన్ని పార్టీల నేతలు అదే ఒరవడి కొనసాగించేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని అందరూ కలిసి ముందుకెళ్తే అభివృద్ధి జరుగుతుందని.... తెంలంగాణ ప్రభుత్వానికి తన పూర్తి సహకారం ఉంటుందని వెల్లడించారు.

Tags

Next Story