ఏపీలో మున్సిపల్ ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని ప్రకటించిన ఈసీ..!

ఏపీలో మున్సిపల్ ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని ప్రకటించిన ఈసీ..!
ఏపీలో మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ వైసీపీ అత్యధిక స్థానాలు కైవసం చేసుకుంది. మొత్తం 73 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలతో పాటు.. 11 కార్పొరేషన్లనూ వైసీపీ కైవసం చేసుకుంది.

ఏపీలో మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ వైసీపీ అత్యధిక స్థానాలు కైవసం చేసుకుంది. మొత్తం 73 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలతో పాటు.. 11 కార్పొరేషన్లనూ వైసీపీ కైవసం చేసుకుంది. అటు ప్రతిపక్ష టీడీపీ పురపోరులో తాడిపత్రి, మైదుకూరు మున్సిపాల్టీల్లో జెండా ఎగురవేసింది. మరోవైపు ఏలూరు కార్పొరేషన్ ఫలితాలను హైకోర్టు ప్రకటించవద్దని ఆదేశించడంతో.. అక్కడ ఫలితాలను ఎన్నికల అధికారులు ప్రకటించలేదు. ఇక పూర్తి ఫలితాలు వెలువడడంతో.. ఏ పార్టీకి ఎంత శాతం ఓటింగ్ నమోదైందో ఎన్నికల సంఘం ప్రకటించింది.

మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీకి 52.63 శాతం ఓట్లు పోలయ్యాయి. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి 30.73 శాతం ఓట్లు వచ్చాయి. అదే సమయంలో జనసేనకు 4.67 శాతం ఓట్లు పోలయ్యాయి. ఇక బీజేపీకి 2.41 శాతం ఓట్లు వచ్చాయి. మరోవైపు కాంగ్రెస్ పరిస్థితి దారుణంగానే ఉంది. ఆ పార్టీకి 0.62శాతం ఓట్లు వచ్చాయి. అటు సీపీఐకి 0.80 శాతం ఓట్లు వస్తే.. సీపీఎంకు 0.81 శాతం ఓట్లు వచ్చాయి. ఇక నోటాకు 1.07 శాతం ఓట్లు పోలయ్యాయి.

Tags

Read MoreRead Less
Next Story