Loss To Aquarist :విద్యుత్ శాఖ సిబ్బంది నిర్వాకం, ఆక్వారైతుకు అపార నష్టం

విద్యుత్ బిల్లు చెల్లించినప్పటికీ, అకస్మాత్తుగా కనెక్షన్ డిస్‌కనెక్ట్ చేయడంతో చెరువులోని రొయ్యలు ఆక్సిజన్ లేక చనిపోయాయని ఆరోపిస్తూ ఆక్వారైతు రవివర్మ కాట్రేనికోన విద్యుత్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు.. తాను బిల్లు చెల్లించినప్పటికీ అది అప్ డేట్ కాకపోవడం తన తప్పుకాదని, తన చెరువుకు కరెంటు నిలిపి వేసేటప్పుడు తనకు సమాచారం ఎందుకు ఇవ్వలేదంటూ రైతు రవివర్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు.. తన చెరువుకు కరెంటు నిలిపివేయడంతో ఏరియేటర్లు పనిచేయక పోవడంతో ఆక్సిజన్ అందక రొయ్యలు చనిపోయాయని, తనకు ఇరవై లక్షల రూపాయల ఆర్దక నష్టం జరిగిందని రవివర్మఆవేదన వ్యక్తం చేసారు. ఇటీవల తరచుగా విద్యుత్ శాఖ సిబ్బందిపై పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒకే ఆధార్ నంబరుపై వందలకొలదీ కరెంటు కనెక్షన్లు ఇవ్వడం, అక్రమ లేఔట్లకు అనధికారంగా ట్రాన్స్ ఫార్మర్లు వేయడం, లంచాలు తీసుకుని చెరువులకు అక్రమ కనెక్షన్లు ఇవ్వడం వంటి అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆక్వా చెరువుల ద్వారా విద్యుత్ శాఖకు లక్షలాది రూపాయలు ఆదాయం వస్తున్నా, ఈ విధంగా రైతులను ఇబ్బందిపెట్టడం సరికాదంటూ, దీనిపై పై ఆధికారులకు ఫిర్యాదు చేస్తున్నట్లు, అవసరమైతే మరిన్ని ఆందోళనలు చేపడతామని ఆక్వా రైతులు హెచ్చరించారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com