Elephants : మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం

Elephants : మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం
X

పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. పార్వతీపురం మండలం కవిటి భద్ర గ్రామంలో పంటలను ధ్వంసం చేశాయి ఏనుగులు. రాత్రివేళలో పంటలను ధ్వంసం చేస్తుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఏనుగుల సంచారంతో స్థానిక ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. అటవీశాఖ అధికారులు స్పందించి..ఏనుగులను ఇక్కడి నుండి తరలించాలని కోరుతున్నారు. రాత్రి పంటపొలాలను ధ్వంసం చేస్తుండగా గమనించిన గ్రామస్తులు..అక్కడి నుండి వెళ్లగొట్టగా..సుడిగాం గ్రామం వైపు వెళ్లాయని గ్రామస్తులు తెలిపారు.

Tags

Next Story