Anna Canteen: అన్నా క్యాంటిన్లకు అడుగడుగునా వైసీపీ అడ్డంకులు..

Anna Canteen: ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గంలో వైసీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రీడల పోటీలో.. అన్న క్యాంటిన్‌ల ఏర్పాటు చర్చ నీయాంశంగా మారింది. టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నా క్యాంటిన్లకు ఏపీలో వైసీపీ నేతలు అడుగడుగునా అడ్డుతగులుతున్నా...ఆపద సమయంలో ఆదుకున్నాయంటూ స్థానికులు చర్చించుకుంటున్నారు. అందరిని ఔరా అనేలా మేమున్నామంటూ అన్నాక్యాంటీన్‌లతో పసుపుదండు భరోసా ఇవ్వటంతో స్థానికులు జేజేలు పలుకుతున్నారు.
కైకలూరు నియోజకవర్గంలో వైసీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్రస్ధాయి చెడుగుడు పోటీలకు పలు జిల్లాల నుంచి క్రీడాకారులుతోపాటు వీక్షులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. భోజనాల ఏర్పాటు పెద్ద సమస్యగా మారటంతో.... క్రీడాల పోటీకి వ్యక్తిగత హోదాలో అన్నదాన సహాకారం అందించాలి టీడీపీ నేత కొడాలి వినోద్ ను నిర్వాహకులు అభ్యర్థించారు. అన్న క్యాంటిన్ల ద్వారా అన్నదానంకు నిర్వాహకులు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వటంతో... వైసీపీ కోటలో అన్న క్యాంటీన్లు హాల్చల్ చేశాయి.
NTR, చంద్రబాబు, లోకేష్ ఫోటోలతో ఏర్పాటు చేసే అన్న క్యాంటిన్‌లు..శ్రేణుల సహాకారంతో రుచికరమైన వంటకాలను క్రీడాకారులకు అందించారు. క్రీడలు నిర్వహించినన్ని రోజులు అన్న క్యాంటిన్ నిర్విరామంగా సేవలను కొనసాగిస్తుందని కొడాలి వినోద్ భరోసా ఇచ్చారు. కుల, మత, వర్గ, వర్ణ భేదాలు లేకుండా అవసరమున్న వారందరికి అన్నదానం చేయడమే NTR కు ఇచ్చే ఘనమైన నివాళి అని కొడాలి వినోద్ అన్నారు.
YCP ఏర్పాటు చేసిన క్రీడాపోటీలకు టీడీపీ నేత ఆధ్వర్యంలో అన్న క్యాంటిన్ ఏర్పాటు చేయడం స్థానికంగా చర్చనీయాంశమైంది. అవసరమున్నవారికి అపన్నహాస్తం అందించే లక్షసాధనలో వినోద్ అందరికి ఆదర్శప్రాయంగా నిలిచాడని అభినందనలు వెల్లువెత్తాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com