టీడీపీ మాజీ ఎంపీ మాగంటిబాబు కుమారుడు మృతి.. లోకేశ్ తీవ్ర దిగ్భ్రాంతి

ఏలూరు మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నేత మాగంటి బాబు కుమారుడు మాగంటి రాంజీ ఆదివారం రాత్రి మృతి చెందారు.
గత కొన్ని రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రాంజీ.. పరిస్థితి విషమించడంతో కన్నుమూశారు. కొద్ది రోజుల క్రితమే రాంజీ అనారోగ్యం పాలవడంతో కుటుంబ సభ్యులు విజయవాడలోని ఆంధ్రా ఆస్పత్రికి తరలించారు. అప్పటి నుంచి ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది.
ఇక మాగంటి రాంజీ మరణం పట్ల టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తంచేశారు. ఆయన మరణం పార్టీకి తీరని లోటని అన్నారు.
లోకేష్ అన్నా అంటూ పిలిచే ఆ పిలుపు ఇక వినపడదు.మాగంటి రాంజీ మనకి దూరం అయిపోయాడు.తెలుగుదేశానికి అండగా ఉంటానంటూ జెండా పట్టిన పసుపు సైనికుడా నీ మరణం పార్టీకీ,నాకూ తీరని లోటు. (1/2) pic.twitter.com/u7GCze3W45
— Lokesh Nara (@naralokesh) March 7, 2021
మరోవైపు ఏలూరులోని మాగంటి బాబు నివాసానికి రాంజీ పార్దివదేహం తరలించారు. రాంజీ మృతితో కుటుంబసభ్యులు, అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. రాంజీ మృతి పట్ల టీడీపీ నేతలు, ప్రముఖులు నివాళులు తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com