Vijayawada: దుర్గమ్మ హుండీ లెక్కింపులో సిబ్బంది చేతివాటం.. బాత్రూంలో 12 తులాల బంగారం..

Vijayawada: దుర్గమ్మ హుండీ లెక్కింపులో సిబ్బంది చేతివాటం.. బాత్రూంలో 12 తులాల బంగారం..
Vijayawada: విజయవాడ కనక దుర్గమ్మ హుండీ లెక్కింపులో సిబ్బంది చేతివాటం ప్రదర్శించారు.

Vijayawada: విజయవాడ కనక దుర్గమ్మ హుండీ లెక్కింపులో సిబ్బంది చేతివాటం ప్రదర్శించారు. మహా మండపం బాత్రూంలో 12 తులాల బంగారం దొరికింది. స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ తనిఖీల్లో.. ఈ బంగారం బయటపడింది. నిన్న అమ్మవారి హుండీని లెక్కించారు ఆలయ సిబ్బంది. ఈ లెక్కింపులో.. పది లక్షల రూపాయల విలువైన బంగారం మాయం అయినట్లు తెలుస్తోంది. దీనిపై అంతర్గత దర్యాప్తు జరుగుతోంది. అయితే.. ఇప్పటి వరకు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు దేవస్థానం అధికారులు.

దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు భక్తులు. హుండీ లెక్కింపులో బంగారాన్ని కాజేయాలనుకున్న వారిపై ఈవో.. పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదని ప్రశ్నించారు జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్. ఈ అంశంపై దేవాదాయ శాఖ మంత్రి, ఎండోమెంట్‌ కమిషనర్‌, ఈవో స్పందించాలని డిమాండ్‌ చేశారు. అమ్మవారి ఆలయ ప్రతిష్ఠ దిగజారుస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు పోతిన మహేష్‌.

Tags

Read MoreRead Less
Next Story