AP : ప్రతి విద్యార్థికి ఐడీ కార్డు ఇవ్వాలి: సీఎం చంద్రబాబు

AP : ప్రతి విద్యార్థికి ఐడీ కార్డు ఇవ్వాలి: సీఎం చంద్రబాబు
X

విద్య ప్రతి ఒక్కరి హక్కు అని బడి ఈడు పిల్లలు బయట ఉండటానికి వీల్లేదని అధికారులకు సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. 100% విద్యార్థుల ఎన్రోల్మెంట్ జరగాలని సూచించారు. ప్రైవేట్ స్కూళ్లలో మాదిరి ప్రభుత్వ పాఠశాలల్లోనూ పేరెంట్ టీచర్ మీటింగ్ నిర్వహించాలన్నారు. కేంద్రం తీసుకొచ్చిన APAAR ద్వారా ప్రతి విద్యార్థికి ఐడీ కార్డు ఇవ్వాలన్నారు. స్కూళ్లలో ఇంగ్లిష్‌తో పాటు తెలుగుకు ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్నారు.

భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా పాఠశాల విద్య సిలబస్‌లో మార్పులు చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. విద్యాశాఖపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ స్కూళ్లలో మౌళిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టాలన్నారు. గత ప్రభుత్వ విధానాలతో పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పడిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. విలువలతో కూడిన నాణ్యమైన విద్య ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.

ఏపీలో లో వంద ఎకరాల చొప్పున 100 ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేయనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఓడరేవులు, ఎయిర్‌పోర్టులు, పారిశ్రామిక పార్కులపై అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ‘ఫుడ్ ప్రాసెసింగ్, ఆక్వా రంగాల ఆధారిత పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేయాలి. విజయవాడ మల్లవల్లి పార్కులో పూర్తి కార్యకలాపాలు జరగాలి. ఉపాధి అవకాశాలు, సంపద సృష్టి కేంద్రాలుగా పోర్టుల నిర్మాణం ఉండాలి’ అని CM సూచించారు.

Tags

Next Story