వైసీపీకి గూండాలుగా వాలంటీర్లు పనిచేస్తున్నారు: అఖిలప్రియ

వైసీపీకి గూండాలుగా వాలంటీర్లు పనిచేస్తున్నారు: అఖిలప్రియ
మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ఉపసంహరణలో అన్యాయంగా, బెదిరింపులకు పాల్పడిన వైసీపీ నాయకులు సిగ్గుపడాలన్నారు.

వైసీపీకి గూండాలుగా వాలంటీర్లు పనిచేస్తున్నారని మాజీమంత్రి అఖిలప్రియ మండిపడ్డారు. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ఉపసంహరణలో అన్యాయంగా, బెదిరింపులకు పాల్పడిన వైసీపీ నాయకులు సిగ్గుపడాలన్నారు. వైసీపీ నేతలు ఎంత ఒత్తిడి చేసినా.. ఆళ్లగడ్డలో 19 వార్డుల్లో పోటీ చేస్తున్నామని ఆమె తెలిపారు. ఆళ్లగడ్డ 2వ వార్డులో టీడీపీ అభ్యర్థి శివమ్మ తరఫున అఖిలప్రియ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. వైసీపీ నాయకులు పంచే డబ్బుకు ఆశపడి ఓటు వేస్తే.. మున్సిపాలిటీ పరిధిలో అభివృద్ధి జరగదన్నారు మాజీమంత్రి అఖిలప్రియ.

Tags

Read MoreRead Less
Next Story