23 April 2021 7:30 AM GMT

Home
 / 
ఆంధ్రప్రదేశ్ / కరోనా విజృంభిస్తుంటే...

కరోనా విజృంభిస్తుంటే సీఎం జగన్ మాత్రం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు : దేవినేని

రాష్ట్రంలో కరోనా విజృంభణతో ప్రజల ప్రాణాలు ఆపదలో ఉంటే సీఎం జగన్ మాత్రం కక్ష సాధింపు చర్యలకు పరిమితమయ్యారని మాజీ మంత్రి దేవినేని ఉమ మండిపడ్డారు.

కరోనా విజృంభిస్తుంటే సీఎం జగన్ మాత్రం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు : దేవినేని
X

రాష్ట్రంలో కరోనా విజృంభణతో ప్రజల ప్రాణాలు ఆపదలో ఉంటే సీఎం జగన్ మాత్రం కక్ష సాధింపు చర్యలకు పరిమితమయ్యారని మాజీ మంత్రి దేవినేని ఉమ మండిపడ్డారు. 1100 కోట్ల రూపాయల టర్నోవర్ కలిగిన సంగం డెయిరీకి దేశవ్యాప్తంగా ఎంతో మంచి పేరుందని.. అలాంటి డెయిరిని అమూల్ కోసం దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. జగన్ అక్రమాస్తులపై ధూళిపాళ్ల పోరాడినందుకే అక్రమ అరెస్టులు చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. అమరావతి భూముల విషయంలో చంద్రబాబుపై పెట్టిన తప్పుడు కేసులను స్ట్రింగ్ ఆపరేషన్ ద్వారా ధూళిపాళ్ల బయటపెట్టడాన్ని జగన్ తట్టుకోలేకపోతున్నారని పేర్కొన్నారు.

Next Story