17 Oct 2020 10:11 AM GMT

Home
 / 
ఆంధ్రప్రదేశ్ / ప్రభుత్వ నిర్లక్ష్యం...

ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే రాష్ట్రంలో వరద కష్టాలు : మాజీ మంత్రి చినరాజప్ప

ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే రాష్ట్రంలో వరద కష్టాలు : మాజీ మంత్రి చినరాజప్ప
X

ప్రభుత్వ నిర్లక్ష్యం విధానాల వల్లే రాష్ట్రంలో వరద కష్టాలకు కారణమన్నారు మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు నిమ్మకాయల చినరాజప్ప. భారీ వర్షాల కారణంగా ఏర్పడిన వరద ప్రభావిత ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలపై సంబంధిత మంత్రులు దృష్టి పెట్టకుండా...చంద్రబాబు నాయుడి నివాసంపై తూలనాడుతూ సమయం వృధా చేస్తున్నారని దుయ్యబట్టారు. నీటిలో మునిగిన లంకగ్రామాలను, పంటనష్టపోయిన రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ముంపు ప్రాంత ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించాలని చినరాజప్ప వెల్లడించారు.

  • By kasi
  • 17 Oct 2020 10:11 AM GMT
Next Story