AP : మాజీ మంత్రి విశ్వరూప్ కొడుకు అరెస్ట్

మాజీమంత్రి పినిపె విశ్వరూప్ తనయుడు శ్రీకాంత్‌ను అరెస్ట్ చేశారు పోలీసులు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లిలో రెండేళ్ల క్రితం జరిగిన దళిత యువకుడి హత్య కేసులో ఆయనను అరెస్ట్ చేశారు. కోనసీమ అల్లర్ల సమయంలో అయినవిల్లికి చెందిన వాలంటీరు దుర్గాప్రసాద్‌ను 2022 జూన్ 6న హత్య చేయించినట్లు నిర్ధారణకు వచ్చారు. డీజీపీ ద్వారక తిరుమలరావు ఆదేశాలతో ఈ కేసులో వేగం పెంచారు అధికారులు. ఈనెల 18న మృతుడు దుర్గాప్రసాద్ స్నేహితుడు ధర్మేష్‌ను అరెస్ట్ చేసి విచారించారు పోలీసులు. విచారణలో మాజీ మంత్రి విశ్వరూప్ కుమారుడు పినిపే శ్రీకాంత్ ప్రధాన నిందితుడుగా గుర్తించారు. తమిళనాడు మధురైలో వున్న పినిపే శ్రీకాంత్ ను అదుపులోకి తీసుకున్నారు కోనసీమ జిల్లా పోలీసులు. అక్కడ న్యాయమూర్తి నుంచి ట్రాన్సస్ట్ వారెంట్ ద్వారా కస్టడికి తీసుకొని పినిపే శ్రీకాంత్ ను కోనసీమ జిల్లాకు తీసుకొచ్చారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com