ROJA: ఆడంగి వెధవలంటూ రోజా అనుచిత వ్యాఖ్యలు

భగ్గుమంటున్న నెటిజన్లు.. రోజా తిడుతున్న వీడియో వైరల్

వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే రోజా మరోసారి బూతులతో రెచ్చిపోయారు. కూటమి ఎమ్మెల్యేల సవాల్ ను స్వీకరించిన టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి... గోశాలను సందర్శించేందుకు సిద్ధమయ్యారు. పెద్ద సంఖ్యలో వైసీపీ కార్యకర్తలతో కలిసి గోశాలకు బయల్దేరారు. పోలీసులు భూమనను అడ్డుకుని వ్యక్తిగత భద్రతా సిబ్బందిని మాత్రం తీసుకుని గోశాలకు వెళ్లాలని సూచించారు. నిరాకరించిన భూమన రోడ్డుపై బైఠాయించారు. అక్కడకు చేరుకున్న నగరి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి రోజా తెలుగుదేశంపై విమర్శలు గుప్పిస్తూ.. అనుచిత వ్యాఖ్యలు చేశారు. సవాల్ చేసి పారిపోయారంటూ తెలుగుదేశం వారిని ఉద్దేశించి ఆడంగి వెధవలు అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆమె వ్యాఖ్యలు మొత్తంగా మహిళా లోకాన్నే కించపరిచేలా ఉన్నాయంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

పవన్ కు సూటి ప్రశ్నలు

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కి రోజా సూటి ప్రశ్నలు సంధించారు. డైవర్షన్ పాలిటిక్స్ చేసే పవన్.. సనాతన ధర్మాన్ని కాపాడతామన్న వ్యక్తి.. ఇప్పుడు ఎందుకు మాట్లాడడంలేదని ప్రశ్నించారు. తప్పు చేసిన వారిని శిక్షించాలని ఎందుకు నిలదీయడంలేదని అన్నారు.

Tags

Next Story