ఉండవల్లిలో చంద్రబాబు నివాసంపై వైసీపీ కార్యకర్తల దాడితో తీవ్ర ఉద్రిక్తత

ఉండవల్లిలో చంద్రబాబు నివాసంపై వైసీపీ కార్యకర్తల దాడితో తీవ్ర ఉద్రిక్తత
ఉండవల్లిలో వైసీపీ కార్యకర్తలు ఉన్మాదుల్లా రెచ్చిపోయారు. చంద్రబాబు నివాసంపై రాళ్లు, కర్రలతో విచక్షణారహితంగా దాడికి దిగారు.

ఉండవల్లిలో వైసీపీ కార్యకర్తలు ఉన్మాదుల్లా రెచ్చిపోయారు. చంద్రబాబు నివాసంపై రాళ్లు, కర్రలతో విచక్షణారహితంగా దాడికి దిగారు. పెడన MLA జోగి రమేష్‌ ఇవాళ మాజీ సీఎం చంద్రబాబు ఇంటి ముందు ధర్నాకు దిగడంతో ఒక్కసారిగా ఉద్రిక్తత తలెత్తింది. టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు నిన్న CM జగన్‌పై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలంటూ జోగి రమేష్ ధర్నాకు దిగడంతో ఒక్కసారిగా ఉద్రిక్తత తలెత్తింది. YCP కార్యకర్తలు పెద్ద సంఖ్యలో కరకట్ట వద్దకు చేరుకుని రాళ్ల దాడి చేస్తున్నారనే సమాచారం తెలుసుకున్న టీడీపీ వర్గీయులు కూడా క్షణాల్లోనే అక్కడికి చేరుకుని ప్రతిఘటించారు. ఇరువర్గాల ఘర్షణ, తోపులాటతో గంటన్నరపాటు ఆ ప్రాంతమంతా రణరంగాన్ని తలపించింది.

వైసీపీ కార్యకర్తల దాడుల్లో ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న సహా పలువురు టీడీపీ నేతలు తీవ్రంగా గాయపడ్డారు. రాళ్లు, కర్రలతో గూండాల్లా మారి వాళ్లంతా రెచ్చిపోడంతో పరిస్థితి పూర్తిగా అదుపు తప్పింది. అటు, ఈ ఘర్షణను, ఉద్రిక్తతను కవర్ చేస్తున్న మీడియాను కూడా వైసీపీ వాళ్లు టార్గెట్ చేశారు. ఉదేశపూర్వకంగా రాళ్లతో విరచుకుపడ్డారు. టీవీ5 సిబ్బందిని కూడా టార్గెట్ చేసి రాళ్లు విసిరారు. అటు, దాడిలో ఓ మీడియా ప్రతినిధి తలకు బలమైన గాయమైంది. యుద్ధవాతావరణం లాంటి పరిస్థితుల్ని కంట్రోల్ చేయాల్సిన పోలీసులు చోద్యం చూస్తూ ఉండిపోవడం వల్లే వైసీపీ కార్యకర్తలు గూండాల్లా రెచ్చిపోయారని టీడీపీ వర్గీయులు ఆరోపిస్తున్నారు. మాజీ సీఎం నివాసం వద్ద ధర్నాకు జోగి రమేష్‌ వస్తున్నారని తెలిసినప్పుడు ఆయన్ను ముందే కట్టడి చేయకుండా ఎందుకు అనుమతి ఇచ్చారని ప్రశ్నించారు. మందీమార్బలంతో జోగి రమేష్‌ వచ్చి చంద్రబాబు ఇంటి ముందు రచ్చ చేస్తుంటే.. ఎందుకు ఆయన్ను నిలువరించలేకపోయారని ప్రశ్నిస్తున్నారు.

ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం వద్ద వైసీపీ, టీడీపీ వర్గీయుల ఘర్షణతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కావాలనే ఉద్దేశపూర్వకంగానే రెచ్చగొట్టే ఉద్దేశంతోనే వైసీపీ నేతలు, కార్యకర్తలు పథకం ప్రకారం కరకట్టపైకి వచ్చారని టీడీపీ నేతలు మండిపడ్డారు. జెడ్‌ప్లస్ సెక్యూరిటీ ఉన్న మాజీ సీఎం భద్రత విషయంలో పోలీసులు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో చెప్పేందుకు ఇవాళ్టి దాడులే నిదర్శనమని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ వాళ్లకు మద్దతు పలుకుతున్న పోలీసులు.. దాడులకు పరోక్షంగా వారికి సహకరించారని విమర్శించారు.

అయ్యన్నపాత్రుడు జగన్‌కు క్షమాపణ చెప్పకపోతే చంద్రబాబు ఎక్కడ పర్యటించినా అడ్డుకుంటామని జోగి రమేష్ చెప్పడం హాస్యాస్పదమన్నారు టీడీపీ నేతలు. పాలన తీరుపై వాస్తవాలు చెప్తుంటే ఎందుకంత ఉలికిపాటు అంటూ కౌంటర్ ఇచ్చారు. జోగి రమేష్‌ ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వెళ్లారనే విషయం తెలిసి.. TDP ఎమ్మెల్యేలు ఏలూరి సాంబశివరావు, గద్దె రామ్మోహన్‌తోపాటు.. బుద్దా వెంకన్న, పట్టాభి, నాగుల్‌మీరా సహా పలువురు వెంటనే అక్కడికి చేరుకున్నారు. వైసీపీ కావాలనే రాద్ధాంతం చేసేందుకే ఇలా ధర్నాకు దిగారంటూ మండిపడ్డారు. వీధిరౌడీల తరహాలో వైసీపీ కార్యకర్తలు దాడులు చేస్తున్నారని, కావాలనే రెచ్చగొడుతున్నారని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. మందీమార్బలంతో కావాలనే ఒక పథకం ప్రకారమే వచ్చి దాడులు చేస్తున్నారని ఆరోపించారు. వైసీపీ కార్యకర్తల్ని కంట్రోల్ చేయడంలో పోలీసులు పూర్తిగా వైఫల్యం చెందారని విమర్శించారు.

Tags

Read MoreRead Less
Next Story