YSRCP : వైసిపి మరో ఫేక్ సర్వే.. నమ్మితే అంతే..

వైసిపి నేతలు జగన్ ఆత్మసంతృప్తి కోసం ఫేక్ సర్వేలు క్రియేట్ చేయడం కొత్త కాదు. గతంలో కూడా ఇలాంటి ఫేక్ సర్వేలు చూపించి వైసీపీని నిండా ముంచేశారు. అది నిజమే అనుకొని నమ్మిన జగన్ ఎన్నికల్లో ఎంత ఘోరంగా ఓడిపోయాడో చూసాం. ఇప్పుడు జగన్ ను సంతృప్తి పరచడం కోసం ఈ గడిచిన 18 నెలల కాలంపై ఆత్మసాక్షి సర్వే అని ఒకటి చేయించారు. వాస్తవానికి ఇది సాక్షి ప్రతినిధులు కొందరు, సీనియర్ జర్నలిస్టులు కలిసి డిసైడ్ చేసిన సర్వే. ఇందులో ఒక్కటి కూడా నమ్మేలాగా లేదు. ఈ 18 నెలల కాలంలోనే కోటమి మీద విపరీతమైన వ్యతిరేకత పెరిగిపోయిందని.. జనమంతా జగనే రావాలని కోరుకుంటున్నట్టు బిల్డప్ ఇచ్చేశారు. ఈ సర్వేను చూస్తే జగన్ నిజంగానే సంతృప్తి చెందుతాడేమో. ఎందుకంటే ఆ స్థాయిలో ఈ సర్వేలు ఉన్నాయి.
నిరుద్యోగులను, రైతులను కలిసి అభిప్రాయాలు తీసుకుందామని చెబుతున్నారు కానీ ఇదంతా తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చుని రాసిన స్క్రిప్ట్ అని తేలిపోతుంది.
గత ఎన్నికలకు ముందు ఇలాంటి ఫేక్ సర్వేలు సృష్టించి జగన్ ను బోల్తా కొట్టించేశారు. ఆయన దగ్గర ఏదో మార్కులు కొట్టేయడానికి వాళ్లే పేపర్ల మీద రాసుకున్న స్క్రిప్టులను తీసుకెళ్లి సర్వేలు అంటూ చూపించి వై నాట్ 175 అనే నినాదాలను తీసుకొచ్చారు. గ్రౌండ్ రియాల్టీని పక్కన పెట్టేసి జగన్ వీటినే నమ్ముకున్నాడు. కార్యకర్తలు ఎంత మొత్తుకున్నా సరే వాళ్లను కనీసం పట్టించుకోలేదు. వైసిపి కార్యకర్తలు ఇలాంటి ఫేక్ సర్వేలను నమ్మొద్దని కోరినా సరే వినిపించుకోలేదు. దాని ఫలితం ఎంత ఘోరంగా వచ్చిందో మనం చూసాం.
కుప్పంలో చంద్రబాబు ఓడిపోతున్నాడని, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ఓడిపోతున్నారు అంటూ ఇవే ఫేక్ సర్వేలు చెప్పాయి. కానీ ఏం జరిగిందో అందరూ చూశారు కదా. కాబట్టి జగన్ ఇలాంటి ఫేక్ సర్వేలను నమ్మినంత కాలం ఆయనకు ఓటములు తప్పవు. గ్రౌండ్ రియాలిటీని, కార్యకర్తల అభిప్రాయాలను పట్టించుకున్నప్పుడే ఆ పార్టీకి ఎంతో కొంత మనుగడ ఉంటుంది. ఇలాంటి డబ్బా సర్వేలను జగన్ తన సంతృప్తి కోసం పక్కన పడకపోవచ్చు అంటున్నారు కూటమినేతలు. కాబట్టి వైసిపి ఇప్పట్లో కోలుకునే అవకాశాలు కూడా లేవంటున్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

