Anantapur: అనంతపురంలో ఆవుకు సీమంతం.. చీర, పూలు, పిండి పదార్ధాలతో ఘనంగా..

X
By - Divya Reddy |12 Jun 2022 7:00 PM IST
Anantapur: సంస్కృతి సంప్రదాయాలు కనుమరుగవుతున్న ఈ రోజుల్లో పాడి ఆవుకు సీమంతం నిర్వహించి మురిసిపోయాడో రైతు.
Anantapur: సంస్కృతి సంప్రదాయాలు కనుమరుగవుతున్న ఈ రోజుల్లో పాడి ఆవుకు సీమంతం నిర్వహించి మురిసిపోయాడో రైతు. అనంతపురం జిల్లా కొత్తచెరువు మండలం మీర్జాపురం పంచాయతీలోని బంగారు చెన్నేపల్లిలో రైతులు దంపతులు శంకర్‌రెడ్డి, సరస్వతి ఏడాది క్రితం ఆవును కొనుగోలు చేశారు. కన్నబిడ్డలా పెంచుకుంటున్నారు. ఆ ఆవు గర్భం దాల్చడంతో సీమంతం నిర్వహించాలని నిర్ణయించారు. గ్రామంలోని మహిళలను కార్యక్రమానికి ఆహ్వానించారు. కొత్త చీర, పూలు, పిండి పదార్థాలు తీసుకొచ్చి ఘనంగా సీమంతం నిర్వహించారు. పలువురు మహిళలు సీమంతం పాటలు పాడుతూ వేడుకలు నిర్వహించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com