Konaseema District: ఎదురుతిరిగిన రైతులు.. కోనసీమ జిల్లాలో క్రాప్ హాలిడే..

Konaseema District: ఖరీఫ్‌లో క్రాప్ హాలిడే దిశగా కోనసీమ రైతులు కదులుతున్నారు.. జిల్లాలోని 12 మండలాల్లో క్రాప్ హాలిడేకి పిలుపునిచ్చింది కోనసీమ రైతు పరిరక్షణ సమితి.. తమ సమస్యలపై అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. దిక్కుతోచని స్థితిలోనే తాము క్రాప్ హాలిడేకు సిద్ధమయ్యామని చెప్తున్నారు. ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యానికి సకాలంలో డబ్బు చెల్లించలేదని రైతులు ఆరోపిస్తున్నారు..
ఎరువులు, సాగు ఖర్చులు పెరిగిపోయి పండించిన పంటకు గిట్టుబాటు ధర రావడం లేదని ఆవేదన చెందుతున్నారు.. పంట కాలువలు, డ్రెయిన్ల నిర్వహణ సక్రమంగా లేక పొలాలు ముంపునకు గురవుతున్నాయని.. దీంతో ప్రతి ఏటా తమకు మొదటి పంటను నష్టపోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. వరిసాగు గిట్టుబాటు కాక 2011లో క్రాప్ హాలిడే ప్రకటించగా.. ఆ సమస్యలు ఇప్పటికీ పరిష్కారం కాకపోవడంతో మరోసారి క్రాప్ హాలిడేకి సిద్ధమయ్యారు కోనసీమ రైతులు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com