Eluru: యువతిని వేధించిన యువకుడు.. అందుకే ఉప్పెన సినిమా తరహాలో తండ్రి దాడి..

Eluru: యువతిని వేధించిన యువకుడు.. అందుకే ఉప్పెన సినిమా తరహాలో తండ్రి దాడి..
Eluru: ఉప్పెన సినిమా తరహాలో చాట్రాయి మండలం నరసింహరావుపాలెంలో యువకుడి మర్మాంగంపై రోకలిబండతో దాడి చేశాడో యువతి తండ్రి.

Eluru: ఏలూరు జిల్లాలో దారుణం జరిగింది. ఉప్పెన సినిమా తరహాలో చాట్రాయి మండలం నరసింహరావుపాలెంలో యువకుడి మర్మాంగంపై రోకలిబండతో దాడి చేశాడో యువతి తండ్రి. దీంతో ఆ యువకుడి పరిస్థితి విషమించిందని విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. తన కూతురు వెంటపడుతున్నాడన్న నెపంతో శ్రీకాంత్‌ అనే యువకుడిని ఇంటికి పిలిపించి చిత్రహింసలు పెట్టాడు జాన్‌ అనే వ్యక్తి. అంతటితో ఆగకుండా యువకుడి మర్మాంగంపై రోకలిబండతో దాడి చేశాడు. అపస్మారక స్థితిలో ఉన్న ఆ యువకుడిని స్థానికులు 108 సాయంతో ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.

Tags

Next Story