FENGAL CYCLONE: నేడు తీరం దాటనున్న పెంగల్ తుపాను

FENGAL CYCLONE: నేడు తీరం దాటనున్న పెంగల్ తుపాను
X
ఏపీలోని పలు జిల్లాలకు రెడ్ అలర్ట్‌... ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక

బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుపాను ఇవాళ మామల్లపురం-కరైకల్ మధ్య తీరం దాటనుందని చెన్నై వాతావరణ శాఖ తెలిపింది. వాతావరణ శాఖ ప్రకారం.. తుపాను తీరం దాటే కొద్దీ భారీ వర్షాలు కురుస్తాయి. అల్పపీడనం తీరం దాటే సమయంలో గంటకు 55 నుంచి 65 కి. మీ వేగంతో గాలులు వీస్తాయి. మధ్యలో గంటకు 75 కి. మీ వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది.

తెలుగు రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు

ఏపీలోని దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇవాళ, రేపు కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని ఐఎండీ వెల్లడించింది. నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. దక్షిణ కోస్తాలో గరిష్ఠంగా గంటకు 75 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని స్పష్టం చేసింది. ఇప్పటికే వేటకు వెళ్లిన వారు వెంటనే తీరానికి చేరుకోవాలని సూచించింది. తుపాను నేపథ్యంలో, ఏపీలోని కృష్ణపట్నం, నిజాంపట్నం పోర్టుల్లో మూడో నెంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. రాష్ట్రంలోని మిగిలిన పోర్టుల్లో ఒకటో నెంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.


రెడ్‌ అలర్ట్ జారీ అయిన జిల్లాలు

నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లా, చిత్తూరు జిల్లాలకు అధికారులు రెడ్‌ అలర్ట్ జారీ చేశారు. ఇక్కడ భారీ వర్షాలకు ఛాన్స్‌ ఉందంటున్నారు. మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. కడప ప్రకాశం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని చెబుతున్నారు.

తమిళనాడులోనూ భారీ వర్షాలు

ఫెంచల్ తుఫాను కారణంగా తమిళనాడులోని 7 జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. తమిళనాడులోని పుదుచ్చేరి, కారైకాల్‌, చెన్నై, తిరువళ్లూరు, చెంగల్పట్టు. కాంచీపురం, విల్లుపురం, కళ్లకురిచ్చి, కడలూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. రాణిపేట్, తిరువణ్ణామలై, వేలూరు, పెరంబలూరులో కొన్ని చోట్ల అతి భారీ వర్షం కురుసే అవకాశం ఉంది. అరియలూర్, తంజావూరు, తిరువారూర్, మైలాడుతురై, నాగపట్నం జిల్లాలు వర్షాలు పడతాయి. తిరుపత్తూరు, కృష్ణగిరి, ధర్మపురి, సేలం, నమక్కల్, తిరుచిరాపల్లి, పుదుకోట్టై, కరూర్ జిల్లాల్లో కూడా ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కరుస్తాయని చెబుతున్నారు.

Tags

Next Story