ఉప్పెనలా మారుతున్న విశాఖ ఉక్కు ఉద్యమం..!

ఉప్పెనలా మారుతున్న విశాఖ ఉక్కు ఉద్యమం..!
ఉక్కు ఉద్యమం ఉప్పెనలా మారుతోంది. స్టీల్‌ సిటీ నుంచి దేశ రాజధాని హస్తినకు విస్తరించాయి. విశాఖలో మొదలైన స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేక పోరు.. ఇపుడు ఢిల్లీకి తాకింది.

ఉక్కు ఉద్యమం ఉప్పెనలా మారుతోంది. స్టీల్‌ సిటీ నుంచి దేశ రాజధాని హస్తినకు విస్తరించాయి. విశాఖలో మొదలైన స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేక పోరు.. ఇపుడు ఢిల్లీకి తాకింది. స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ సభ్యులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేసింది.

సేవ్ వైజాగ్ స్టీల్‌ నినాదంతో జరుపుతున్న పోరాటానికి జాతీయస్థాయి నేతల మద్దతు కూడగట్టే పనిలో ఉన్నారు. ఇందులో భాగంగా ఢిల్లీకి వెళ్లిన కమిటీ సభ్యులు ఈరోజు వైసీపీ ఎంపీలను కలిసారు. ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ జరగకుండా తమ వంతు కృషి చేయాలని వినతి పత్రం అందజేశారు.

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌తో పాటు కేంద్ర మంత్రులు, పలువురు రాజకీయ పార్టీల నేతలను కలుస్తామని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ సభ్యులు అన్నారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలని కేంద్ర పెద్దలను కోరాతామన్నారు. ఒక్క పైసా కూడా సాయం చేయని కేంద్రం ఇప్పుడు ప్రైవేటీకరణ చేయాలని చూస్తోందని కమిటీ సభ్యులు ఆరోపించారు.

ఢిల్లీలో రైతులు చేపడుతున్న పోరాటాల స్ఫూర్తితో విశాఖ ఉక్కు ఉద్యమాన్ని కొనసాగిస్తామని కమిటీ సభ్యులు అన్నారు. తమ ఉద్యమానికి దేశవ్యాప్తంగా మద్దతు దొరికిందని స్పష్టంచేశారు.

స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఏప్రిల్ 18న అన్ని కార్మిక సంఘాలతో కలిసి భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తామన్నారు. ఈ సభకు అన్ని జాతీయస్థాయి నేతలతో పాటు రైతు ఉద్యమ నేత రాకేష్ టికాయట్ హాజరవుతారని కమిటీ సభ్యులు తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story