Polavaram Office : పోలవరం కార్యాలయంలో ఫైళ్లు దగ్ధం

Polavaram Office : పోలవరం కార్యాలయంలో ఫైళ్లు దగ్ధం
X

ధవళేశ్వరంలోని పోలవరం ప్రాజెక్టు పరిపాలనా కార్యాలయంలో పలు ఫైళ్లు దగ్ధం అయ్యాయి. ఎడమ కాలువ భూసేకరణకు సంబంధించిన దస్త్రాలు ఇందులో ఉన్నట్లు తెలుస్తోంది. లబ్ధిదారుల పరిహారంలో అక్రమాలు బయటకు వస్తాయనే వీటిని కాల్చినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఘటనలో పలువురు అధికారుల పాత్ర ఉన్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వేదవల్లి దీనిపై విచారిస్తున్నారు. అందులో అవకతవకలు జరగడంతో కొందరు అధికారులు కావాలనే ఈ పనికి పాల్పడినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Tags

Next Story