KA Paul: కాకినాడలో కేఏ పాల్‌‌కు అవమానం.. కాన్వాయ్‌ను అడ్డుకొని..

KA Paul: కాకినాడలో కేఏ పాల్‌‌కు అవమానం.. కాన్వాయ్‌ను అడ్డుకొని..
KA Paul: కాకినాడలో ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్‌కు అవమానం జరిగింది.

KA Paul: కాకినాడలో ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్‌కు అవమానం జరిగింది. కేఎ పాల్‌ కాన్వాయ్‌ను ఫైనాన్షియర్లు అడ్డుకుని రెండు కార్లను సీబీసీఎన్‌ కాలేజ్‌ కాంపౌండ్‌కు తరలించారు. కాలేజ్‌ గేటు తాళాలను తొలగించేందుకు పాల్‌ వద్ద ఉండే బౌన్సర్లు ప్రయత్నించారు. దీంతో ఫైనాన్షియర్లకు, బౌన్సర్లకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసుల రంగ ప్రవేశంతో కేఎ పాల్‌ కార్లను ఫైనాన్షియర్లు విడిచిపెట్టారు.

తమకు పాల్‌ పెద్ద మొత్తంలో డబ్బులివ్వాలని, వాటి గురించి అడిగితే బెదిరిస్తున్నారని ఫైనాన్షియర్‌ రత్నకుమార్‌ చెప్పారు. కేఎ పాల్‌ తమకివ్వాల్సిన బకాయిలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. కాగా తాను హోటల్లో బస చేస్తే.. కార్లను కాలేజ్‌ కాంపౌండ్‌లో పార్కింగ్‌ చేశారని, అంతకుమించి ఏమీ లేదన్నారు కేఎ పాల్‌. కాకినాడ పర్యటన విజయవంతమైందని తెలిపారు.

Tags

Next Story