Vizianagaram District : హాస్టల్‌లో అగ్నిప్రమాదం.. వార్డెన్ అప్రమత్తతో...

విజయనగరం జిల్లాలోని కేజీబీవీ హాస్టల్‌లో పెను ప్రమాదం తప్పింది. అర్ధరాత్రి బాలికల హాస్టల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. ఐతే హాస్టల్ వార్డెన్ అప్రమత్తతో... ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
విజయనగరం జిల్లా కొత్తవలస మండలం తుమ్మకాపల్లి కేజీబీవీ హాస్టల్ లోని ఇంటర్ సెకండియర్ స్టోర్ రూమ్ లో మంగళవారం రాత్రి మంటలు చెలరేగాయి. గమనించిన విద్యార్థులు గట్టిగా అరవడం తో అప్రమత్తమైన వార్డెన్, ఇతర సిబ్బంది విద్యార్థులను బయటకు సురక్షితంగా తరలించారు. ఫైర్ సిబ్బందికి వెంటనే సమాచారం అందించడం తో వారు మంటలను అదుపు చేశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు వచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే నెల రోజుల వ్యవధిలో నే రెండోసారి అగ్నిప్రమాదం జరగడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com