స్వామివారి కల్యాణోత్సవ రథం దగ్ధం

స్వామివారి కల్యాణోత్సవ రథం దగ్ధం
తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో అగ్ని ప్రమాదం జరిగింది.

తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో వారి కల్యాణోత్సవ రథం దగ్థమైంది. శనివారం అర్థరాత్రి ఒంటిగంట సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. షెడ్డులో భ్రదపరిచి ఉన్న రథానికి మంటల అంటుకోవడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇది ప్రమాదవశాత్తు జరిగిన ఘటనా? లేకపోతే ఎవరైనా ఉద్దేశపూర్వకంగా చేసిన పనా అనే దానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ప్రతీ ఏడాది స్వామివారి కల్యాణోత్సవాల్లో రథోత్సవం నిర్వహిస్తారు.

Tags

Read MoreRead Less
Next Story