తిరుమలలో తప్పిన భారీ ప్రమాదం

తిరుమలలో తప్పిన భారీ ప్రమాదం
X
మంటలను గుర్తించిన టీటీడీ విజిలెన్స్ అధికారులు.. ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు.

తిరుమలలో భారీ ప్రమాదం తప్పింది. టీటీడీ అభివృద్ధి విస్తరణ పనుల్లో భాగంగా నూతనంగా చేపడుతున్న ఔటర్ రింగ్ రోడ్డులో ఆపి ఉంచిన ప్రొక్లెయినర్ నుంచి అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. భారీగా మంటలు ఎగసిపడటంతో.. ప్రొక్లెయినర్ పూర్తిగా అగ్నికి ఆహుతైంది. మంటలను గుర్తించిన టీటీడీ విజిలెన్స్ అధికారులు.. ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది.. మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. గత రెండ్రోజులుగా ఒకే చోట ఉంచిన ప్రొక్లెయినర్‌లో మంటలు ఎలా చెలరేగాయో అని తిరుమల పోలీసులు ఆరా తీస్తున్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నారు.


Tags

Next Story