AP : బాణ సంచా పేలుడు కేసు.. 8కి చేరిన మృతులు

ఏపీ అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాసపట్నంలో బాణసంచా తయారీ కేంద్రంలో నిన్న భారీ పేలుడు సంభవించిన విషయం తెలిసిందే.. ఈ ఘటనలో 8 మంది మృతి చెందగా.. మరో ఏడుగురికి గాయాలయ్యాయి. ఇందులో నలుగురి కార్మికుల కండీషన్ సీరియస్ గా ఉన్నట్లుగా తెలుస్తోంది. వీరిని విశాఖలోని కేజీహెచ్ కి తరలించారు. ఇందులో డాక్టర్లు నర్సీపట్నంలో మరో ముగ్గురికి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన కార్మికుల్లో కైలాసట్నం గ్రామానికి చెందిన నలుగురుఉన్నారు. ఈ ఘటనలో బాణాసంచా కేంద్రం తయారీ ఓనర్కు గాయాలు కాగా.. అతడికి విశాఖ కేజీహెచ్ లో ట్రీట్మెంట్ అందిస్తున్నారు. విశాఖ కేజీహెచ్ లో చికిత్స పొందుతున్న నలుగురు కార్మికుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. షార్ట్ బాక్స్ లో మందు గుండు కూరుస్తుండగా అగ్గి రవ్వలు చెలరేగి ఈ ప్రమాదం జరిగింది. నిన్న సంఘటన స్థలాన్ని పరిశీలించిన హోం మంత్రి అనిత, విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి, రీజనల్ ఫైర్ ఆఫీసర్ నిరంజన్ రెడ్డి పరిశీలించారు. బాణసంచా కేంద్రంలో అగ్ని ప్రమాదానికి పూర్తి కారణాలను పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com