AP : అభిప్రాయ సేకరణ కొరకు సుపరిపాలనలో తొలి అడుగు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలం కావడంతో రాష్ట్రంలో రేపటినుండి నెలరోజుల పాటు అన్ని నియోజకవర్గాలలో తమ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులను వివరిస్తూ ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ప్రతిగడపకు వెళ్లే కార్యక్రమం రూపొందించినట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు... ఆత్మకూరు పట్టణంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను దశలవారీగా నెరవేరూస్తున్నామని అలాగే సంక్షేమ పథకాలకు పెద్దపీట వేస్తూ వాటికి ఎటువంటి ఆటంకం కలగకుండా నిధులు విడుదల చేస్తున్నట్లు వారు తెలిపారు... తమ ప్రభుత్వ పనితీరుపై ప్రజా అభిప్రాయాలు, ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమం ద్వారా రేపటినుండి తన నియోజకవర్గంలో పర్యటిస్తున్నానని మంత్రి ఆనం తెలిపారు... ప్రతిరోజు 30 నుండి 50 కుటుంబాలను సందర్శించి వారి అవసరాలను వారి సమస్యలను తెలుసుకుంటామని తెలిపారు.. సంక్షేమ పథకాలలో తమ ప్రభుత్వం విఫలమవుతుందని తమ ప్రత్యర్థులు పడ్డ సంబరాన్ని ఆవిరి చేశామని అన్నారు.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నా సంక్షేమ పథకాల కోసం నిధులను మంజూరు చేశామని, ఎన్టీఆర్ భరోసా పేరిట పెన్షనర్లకు ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా ప్రభుత్వం రాగానే పెన్షన్లు పెంచి ఇచ్చామని, అలాగే రైతు భరోసా నిధులను విడుదల చేశామని, పేదవాని కడుపు నింపేందుకు అన్నా క్యాంటీన్లు, విద్యార్థుల విద్యా భవిష్యత్తు కోసం తల్లికి వందనం నిధులు అందించామన్నారు.. వచ్చే నెల నుండి ఉచిత బస్సు, అలాగే ఆడబిడ్డ నిధి, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు, ప్రజా సంక్షేమ పథకాల కోసం ప్రత్యేక నిధులు విడుదల చేస్తూ అన్ని పథకాలు అమలు చేస్తామని అన్నారు.ఈ 30 రోజుల్లో అన్ని మండలాలలో అన్ని గ్రామాలలో ప్రజల అవసరాలను సమస్యలను తెలుసుకుంటామని మంత్రి ఆనం తెలిపారు, ఈ కార్యక్రమంలో డివిజన్ స్థాయి అధికారులు ముఖ్య నేతలు హాజరయ్యారు
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com