Krishna: కృష్ణాజిల్లాలో విషాదం.. వాగులో ఈతకు వెళ్లి అయిదుగురు పిల్లలు గల్లంతు..

Krishna: కృష్ణాజిల్లా చందర్లపాడు మండలం ఏలూరు గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ఏటూరు వద్ద మున్నేరు వాగులో ఐదుగురు పిల్లలు గల్లంతయ్యారు. గ్రామానికి చెందిన 8 నుంచి 13 ఏళ్ల మధ్య వయసు కలిగిన ఐదుగురు పిల్లలు మధ్యాహ్నం సమయంలో ఇంటి నుంచి మున్నేరు వైపు వెళ్లారు. రాత్రి అవుతున్నా పిల్లలు ఇంటికి రాకపోవడంతో ఆందోళనలతో ఉన్న తల్లిదండ్రులు.. వారి ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. పిల్లల బట్టలు, వారి సైకిళ్లు మున్నేరు ఒడ్డున ఉండటంతో ఆ పరిసర ప్రాంతాల్లో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఇప్పటికీ పిల్లల ఆచూకీ తెలియకపోవడంతో తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. గల్లంతైన వారు చరణ్, బాల యేసు, అజయ్, రాకేష్, సనిగా పోలీసులు గుర్తించారు. స్థానిక ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు సంఘటనా ప్రాంతానికి చేరుకొని గాలింపు చర్యలను పర్యవేక్షిస్తున్నారు. మున్నేరులోకి నాటు పడవలను పంపించి పరిసర ప్రాంతాల్లో గాలిస్తున్నారు. రాత్రి కావడంతో చీకట్లో వెతుకులాటకు ఇబ్బంది అవుతుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com