AP: రెండు విషాదాల్లో అయిదుగురు చిన్నారుల మృతి

AP: రెండు విషాదాల్లో అయిదుగురు చిన్నారుల మృతి
X
నీటిగుంతలో పడి ముగ్గురు చిన్నారులు మృతి... జలాశయం చూసేందుకు వెళ్లి ఇద్దరు కన్నుమూత

చిత్తూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కుప్పం మండలం దేవరాజపురంలో నీటి గుంతలోపడి ముగ్గురు చిన్నారులు దుర్మరణం పాలయ్యారు. ఓ ఇంటి పునాది కోసం తవ్విన గుంతలో వర్షం నీరు చేరింది. ఆడుకుంటూ అటువైపుగా వెళ్లిన ఈ ముగ్గురు అందులో పడి ప్రాణాలు కోల్పోయారు. మృతి చెందిన వారిలో ఇద్దరు బాలికలు ఓ బాలుడు ఉన్నాడు. మృతులు శాలిని (5), అశ్విన్‌ (6), గౌతమి (8)గా గుర్తించారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్ట్​మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

జలాశయం చూసేందుకు వెళ్లి...

ఏలూరు జిల్లాలో జరిగిన ఘటనలో ఇద్దరు చిన్నారులు చనిపోయారు. జల్లేరు జలాశయం చూసేందుకు వెళ్లిన ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. 10 ఏళ్ల సిద్దిఖ్, 7 ఏళ్ల అబ్దుల్ నీట మునిగడంతో మృతిచెందారు. చిన్నారుల మృతి ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసుకుని విచారణ చేపట్టారు. . తమ పిల్లలు విగత జీవులుగా పడి ఉండటం చూసి చిన్నారుల తల్లిదండ్రులు బోరున విలపించారు. ఇది చూసి అక్కడివారు కన్నీటి పర్యంతమయ్యారు.

Tags

Next Story