1 May 2021 11:00 AM GMT

Home
 / 
ఆంధ్రప్రదేశ్ / కర్నూలు జిల్లాలోని...

కర్నూలు జిల్లాలోని ప్రైవేట్ ఆస్పత్రిలో దారుణం..ఆక్సిజన్ అందక ఐదుగురు మృతి

కర్నూలులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో దారుణం చోటుచేసుకుంది. కేఎస్ కేర్ ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక ఐదుగురు మృతి చెందారు.

కర్నూలు జిల్లాలోని ప్రైవేట్ ఆస్పత్రిలో దారుణం..ఆక్సిజన్ అందక ఐదుగురు మృతి
X

కర్నూలులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో దారుణం చోటుచేసుకుంది. కేఎస్ కేర్ ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక ఐదుగురు మృతి చెందారు. అ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. ఐదుగురు కరోనా పేషెంట్లు మరణించడంతో మిగిలిన వారిని కాపాడుకునేందుకు రోగుల బంధువులు ప్రయత్నిస్తున్నారు. కేఎస్ కేర్ ఆసత్రి వైద్యుల నిర్వాకంపై రోగుల బంధువులు మండిపడుతున్నారు. ప్రభుత్వ అనుమతి లేకుండా ఆస్పత్రి యాజమాన్యం.. కరోనా ట్రీట్‌మెంట్ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.

ఆక్సిజన్ కొరతతో సొంతంగా బయటి నుంచి ఆక్సిజన్ సిలెండర్లు తెచ్చుకుంటున్నామని కరోనా పేషెంట్ల బంధువులు చెబుతున్నారు. ఐదుగురు కరోనా రోగులు చనిపోవడంపై కేఎస్ కేర్ ఆస్పత్రి యాజమాన్యం స్పందించింది. ఆస్పత్రిలో ఆక్సిజన్ కొరత ఉందని అంగీకరించిన ఆస్పత్రి యాజమాన్యం.. తాము కరోనా ట్రీట్‌మెంట్ చేయడం లేదన్నారు. కేవలం ఐసోలేషన్ ట్రీట్‌మెంట్ మాత్రమే ఇస్తున్నామని వైద్యులు చెప్పారు.

Next Story