Kadapa Central Jail : కడప సెంట్రల్ జైలులో ఐదుగురు సిబ్బందిపై సస్పెన్షన్ వేటు

X
By - Manikanta |22 July 2025 11:04 AM IST
కడప సెంట్రల్ జైలులో ఐదుగురు సిబ్బందిపై సస్పెన్షన్ వేటు పడింది. - జైలర్ అప్పారావు, డిప్యూటీ సూపరింటెండెంట్ కమలాకర్‌తో పాటు మరో ముగ్గురు జైలు వార్డర్లపైనా సస్పెన్షన్ వేటు పడింది. - ఖైదీలకు మొబైల్ ఫోన్లు సరఫరా చేశారనే ఆరోపణలతో సస్పెన్షన్ -వేశారు ఉన్నాతాధికారులు. ఖైదీలుగా ఉన్న ఎర్రచందనం స్మగ్లర్లకు సెల్ ఫోన్లు అందజేసినట్లుగా సిబ్బందిపై ఆరోపణలున్నాయి. దీనిపై - 4 రోజులపాటు డీఐజీ రవికిరణ్ విచారణ జరిపారు. ప్రాథమిక నివేదిక ఆధారంగా ఐదుగురిపై సస్పెన్షన్ వేటు వేశారు. ఈ మేరకు జైళ్ల శాఖ డీజీ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఘటన సంచలనంగా మారింది.
Tags
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com