Kadapa : వైసీపీకి ఇక సెలవు .. కలకలం రేపుతున్న ఫ్లెక్సీ

Kadapa : కడప జిల్లా పుల్లంపేట మండలం ఉడుమువారిపల్లిలో వైసీపీకి ఇక సెలవు అన్న ఫ్లెక్సీ కలకలం రేపుతోంది. రాయచోటిని జిల్లా కేంద్రంగా ప్రకటించడాన్ని నిరసిస్తూ ఈ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. మొదట రాజంపేట అన్నమయ్య జిల్లాగా ప్రకటించి ఆ తర్వాత రాయచోటికి జిల్లా కేంద్రం మార్చడంపై గ్రామస్తులు ఈ విధంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఉడుమువారిపల్లి గ్రామస్తులంతా ఏకగ్రీవంగా నిర్ణయించి ఈ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. రాయచోటిలోనే జిల్లా కేంద్రం ఏర్పాటు చేస్తే వైసీపీకి ఇంక సెలవేనంటూ హెచ్చరిస్తున్నారు. రాజంపేటలో బ్రిటిష్ హయాం నుండే ఆర్డీఓ కార్యాలయం ఉందన్నారు. జాతీయ రహదారి, రైల్వే లైను, సమీపంలో రేణిగుంట, కడప విమానాశ్రయాలు వంటి అన్ని వసతులు ఉన్న రాజంపేటను కాదని ఏ వసతులు లేని రాయచోటిని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయడమేంటని సీఎం జగన్‌ను గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com