AP : రాజమండ్రిలో అందుబాటులోకి ఫ్లోటింగ్ రెస్టారెంట్
X
By - Manikanta |28 Oct 2024 6:30 PM IST
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజమండ్రి వద్ద గోదావరిపై ఫ్లోటింగ్ రెస్టారెంట్ అందుబాటులోకి వచ్చింది. పర్యాటకులను సరికొత్త అనుభూతిని ఇచ్చేలా ఈ రెస్టారెంట్‌ను తీర్చిదిద్దారు. ప్రైవేట్ భాగస్వామ్యంలో ఆహ్వానం కిచెన్ సంస్థ ఫ్లోటింగ్ రెస్టారెంట్‌ను గోదావరి నదిలోని బ్రిడ్జి లంకలో ఏర్పాటు చేసింది. ఏపీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఫ్లోటింగ్ రెస్టారెంట్‌ను ప్రారంభించారు. రాజమండ్రి వచ్చే పర్యాటకులకు ఈ రెస్టారెంట్ ఒక మధురానుభూతి కలిగిస్తుందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏపీలో టూరిజం కార్యకలాపాలు పెద్ద ఎత్తున విస్తరిస్తున్నామని తెలిపారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com