Srisailam Dam : శ్రీశైలానికి కొనసాగుతున్న వరద

Srisailam Dam : శ్రీశైలానికి కొనసాగుతున్న వరద
X

శ్రీశైలం జలాశయానికి వరద కొనసాగుతోంది. ఎగువ పరీవాహక ప్రాంతాల నుంచి భారీ వరద వస్తుంది. జూరాల ప్రాజెక్టు నుంచి కూడా శ్రీశైలానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో రెండు గేట్లను పది అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో శ్రీశైలం కుడి, ఎడమ గట్టు జలవిద్యుత్తు కేంద్రాల్లో విద్యుదుత్పత్తి కొనసాగుతోంది. ఇన్ ఫ్లో 75,383 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 1,21,482 క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం నీటిమట్టం 883.50 అడుగులకు చేరింది.

డ్యామ్ పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటి నిల్వ 207.4103 టీఎంసీలుగా ఉంది. అయితే.. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదను అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్పడంతో డ్యామ్ పూర్తిస్తాయి నీటి మట్టానికి చేరుకునే అవకాశం ఉందని ఉందని అధికారులు భావిస్తున్నారు.

Tags

Next Story