AP : ఏలేరు ఉగ్రరూపం.. ముంపులోనే 65 గ్రామాలు

AP : ఏలేరు ఉగ్రరూపం.. ముంపులోనే 65 గ్రామాలు

ఆంధ్రప్రదేశ్ ను జలగండం వెంటాడుతోంది. కాకినాడ జిల్లాలో ఏలేరు నది వరద ఉధృతి కొనసాగుతూనే ఉంది. 8 మండలాల పరిధిలోని 65 గ్రామాల్లో పంట పొలాలు నీటితో నానుతున్నాయి. కాకినాడ-కత్తిపూడి మధ్య గల 216వ జాతీయ రహదారిపై పిఠాపురం, గొల్లప్రోలు వద్ద, ఇతర ప్రధాన రహదారుల పై వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో ఈ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి.

మరోవైపు పిఠాపురం, గొల్లప్రోలు, కొత్తపల్లి మండలాలతోపాటు కిర్లంపూడి, ప్రత్తిపాడు, పెద్దాపురం, సామర్లకోట, ఏలేశ్వరం మండలాల్లో పంటపొలాలు, పలు గ్రామాల్లో గృహాలు వరద నీటిలోనే ఉన్నాయి. బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు వరద తీవ్రత పెరుగుతూనే ఉంది. దీంతో ఇవాళ ఇక్కడ వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉందని రైతులు, ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

Tags

Next Story