చిత్తూరు టీడీపీ మాజీ ఎమ్మెల్యే సత్యప్రభ కన్నుమూత

X
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సత్యప్రభ కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా కరోనా బారిన పడి బెంగళూరులో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 2014 ఎన్నికల్లో ఆమె టీడీపీ తరపున చిత్తూరు అసెంబ్లీకి పోటీచేసి గెలిచారు. 2019 ఎన్నికల్లో రాజంపేటలో పోటీ చేసి ఓటమిపాలయ్యారు. కాగా.. ఇటీవలే ఆమె టీడీపీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా రెండోసారి ఎన్నికయ్యారు. సత్యప్రభ మృతిపట్ల టీడీపీ నేతలు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మధ్యాహ్నం బెంగళూరులో సత్యప్రభ అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
