YS Jagan : బెదిరింపు రాజకీయమే విజయమా జగన్..?

మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి రోజురోజుకూ బెదిరింపు రాజకీయాలు ఎక్కువగా చేస్తున్నారు. ఎలాగూ ప్రజలు ఓడించి మూలన కూర్చోబెట్టారు కాబట్టి తన అసలు రూపాన్ని బయటపెడుతున్నట్టు కనిపిస్తోంది. ఎందుకంటే జగన్ తాను ఒక మాజీ సీఎం అనే విషయాన్ని కూడా మర్చిపోయి ఒక రౌడీషీటర్ లాగా రెచ్చిపోయి బెదిరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు కూటమినేతలు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులకు ప్రజల్లో మంచి ఆదరణ వస్తోంది. ఇంకో 15 సంవత్సరాలు కూటమి ప్రభుత్వమే ఏపీలో అధికారంలో ఉంటుందని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పదేపదే చెప్తున్నారు. అంతర్జాతీయ స్థాయి కంపెనీలు వచ్చి లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టుతుండటంతో ప్రజల్లో మైలేజ్ విపరీతంగా పెరుగుతుంది. ఇది చూసిన వైసిపికి నిద్ర కూడా పట్టట్లేదు. కూటమి ప్రభుత్వానికి ఇంత మంచి ఆదరణ దక్కుతుంటే ఇక తమను ప్రజలు అస్సలు పట్టించుకోరని వైసీపీ డిసైడ్ అయింది.
అందుకే అభివృద్ధికి అడుగడుగునా అడ్డుపడాలని జగన్ ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. ఎలాంటి బెదిరింపులకు పాల్పడినా సరే ఏపీని అభివృద్ధి చేయొద్దని.. ఒకవేళ కూటమి హయాంలో ఏపీ అభివృద్ధి చెందితే వైసీపీని ప్రజలు పట్టించుకోరని జగన్ అండ్ కో బ్యాచ్ డిసైడ్ అయిందంట. ఎట్టి పరిస్థితుల్లో పెట్టుబడిదారులను ఏపీకి రానివ్వొద్దని వాళ్ళు నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే పిపిపి విధానంలో మెడికల్ కాలేజీలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్న వారందరినీ బెదిరిస్తున్నారు వైసిపి నేతలు. జగన్ స్వయంగా మీడియా ముందు మాట్లాడుతూ తాము త్వరలోనే అధికారంలోకి వస్తామని.. ఆ తర్వాత పెట్టుబడిదారులందరినీ లోపల వేస్తామంటూ బెదిరించారు.
ప్రభుత్వం బిడ్లూ వేసిన నాలుగు మెడికల్ కాలేజీల్లో కేవలం ఒక్కదానికి మాత్రమే కిమ్స్ హాస్పిటల్ ముందుకు వచ్చింది. మిగతా మూడింటికి ఒక్క బిడ్ కూడా రాలేదు. ఇది చూసిన వైసిపి తామే గెలిచామంటూ విర్రవీగుతోంది. ఇలాంటి బెదిరింపు రాజకీయాలతో తాము గెలిచాము అని భావించడాన్ని ఏమనాలి. పీపీపీ విధానంలో ప్రజలకు మేలు జరుగుతుంటే వైసీపీ అసలు ఓర్చుకోవట్లేదు. కాబట్టి వారి మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని కూటమినేతలు డిమాండ్ చేస్తున్నారు. మరి ప్రభుత్వం ఎలాంటి యాక్షన్ తీసుకుంటుందో చూడాలి.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

