Vallabhaneni Vamsi : అజ్ఞాతంలోకి వల్లభనేని వంశీ..

Vallabhaneni Vamsi : అజ్ఞాతంలోకి వల్లభనేని వంశీ..
X

మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అజ్ఞాతంలోకి వెళ్లారు. గత కొన్ని రోజులుగా ఆయన ఎక్కడా కనిపించకుండా పోయారు. బెయిల్ వచ్చిన తర్వాత ఆయన ఒక్కసారి కూడా బయటకు రాలేదు. అయితే ఆయన వైసిపి అధికారంలో ఉన్నప్పుడు చేసిన అరాచకాల విషయంలో ఇప్పటికే కేసులు వెంటాడుతూనే ఉన్నాయి. ప్రస్తుతం కోర్టులో వాదనలకు కూడా రావట్లేదు. ఇప్పుడు ఆయన మీద మరో కేసు నమోదు అయింది. వైసిపి అధికారంలో ఉన్నప్పుడు 2024 జూన్ 7న టిడిపికి చెందిన సునీల్ అనే కార్యకర్త మీద వంశీ తన అనుచరులతో దాడి చేయించారు. వంశీని తన మీద దాడి చేయించాడు అని సునీల్ ఇప్పటికే మాచవరం పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టాడు. ఈ కేసును పోలీసులు హత్యాయత్నం కింద నమోదు చేశారు. వంశీకి వారం రోజుల కింద నోటీసులు ఇవ్వడానికి పోలీసులు వెళితే ఆయన అందుబాటులోకి రాలేదు. ఈ కేసులో వంశీ అరెస్ట్ అవుతారని భయం ఆయనకు ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారని సమాచారం. వంశీతో పాటు ఆయన అనుచరులు కూడా కనిపించకుండా పోయారు.

దీంతో వంశీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. అటు ఆయన మీద విజయవాడలో మరో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదయింది. దానికి కూడా వంశీ హాజరు కావట్లేదు. దీంతోపాటు మరో రెండు కేసుల్లోనూ ఆయన నిందితుడుగా ఉన్నాడు. ఈ కేసుల్లో మళ్లీ జైలుకు వెళ్తారని భయం ఆయనలో కనిపిస్తున్నట్టుంది. అందుకే జైలు శిక్ష నుంచి తప్పించుకునేందుకు ఇలా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఒకవేళ నిజంగానే తప్పు చేయకపోయి ఉంటే ఆ కేసులను ధైర్యంగా ఎదుర్కొనేవాడు కదా. ఎందుకంటే కోర్టుల్లో కావాల్సింది సాక్షాలు మాత్రమే. తప్పు చేయకపోతే కచ్చితంగా వంశీ ఆ కేసుల్లో నుంచి ఈజీగా బయటపడేవాడు. కానీ కేసుల నుంచి తప్పించుకోవాలి అని అజ్ఞాతంలోకి వెళ్లిపోవడం అంటే కచ్చితంగా తప్పు చేశాడని అందరూ అనుకుంటారు.

ఈ విషయం వంశీకి తెలియనిది కాదు. కానీ అజ్ఞాతంలోకి వెళ్లినా ఎక్కువ రోజులు తప్పించుకొని తిరగలేడు కదా. చట్టం ముందు అందరూ సమానమే అనే విషయాన్ని వంశీ మర్చిపోతున్నట్టు ఉన్నారు. జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయి ప్రతిపక్షాలను తిడుతూ చంద్రబాబు నాయుడు ఫ్యామిలీని అవమానించడం లాంటివి వంశీకి ఈ గతిని తెచ్చిపెట్టాయని అందరూ అంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు రెచ్చిపోయి తప్పులు చేస్తే ఆ తర్వాత అయినా శిక్షలు తప్పవు అనే విషయాన్ని వంశీ గుర్తుంచుకోవాలి అంటున్నారు కూటమినేతలు.


Tags

Next Story