AP : జనసేనలోకి వైసీపీ మాజీ ఎమ్మెల్యే దొరబాబు?

AP : జనసేనలోకి వైసీపీ మాజీ ఎమ్మెల్యే దొరబాబు?
X

పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత పెండెం దొరబాబు ఆ పార్టీకి రాజీనామా చేయనున్నట్లు సమాచారం. ఈ విషయంపై తన అనుచరులకు క్లారిటీ ఇచ్చారట. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నట్లు తెలుస్తోంది. 2019లో వైసీపీ నుంచి పిఠాపురం ఎమ్మెల్యేగా ఆయన గెలిచారు. 2024లో ఆయనకు టికెట్ నిరాకరించిన వైఎస్ జగన్ పార్టీ అభ్యర్థిగా వంగా గీతను నిలబెట్టిన విషయం తెలిసిందే.

పెండెం దొరబాబు 2004లో బీజేపీ నుంచి పిఠాపురంలో ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరగా.. వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి దగ్గరి వ్యక్తిలా ఉన్నారు. 2012లో ఆ పార్టీకి రాజీనామా చేసి వైఎస్సార్‌సీపీలో చేరగా.. 2014లో ఆ పార్టీ నుంచి పిఠాపురంలో పోటీచేసి ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ నుంచి పిఠాపురంలో పోటీచేసి విజయం సాధించారు.. అయితే 2024 ఎన్నికలకు వైఎస్సార్‌సీపీ టికెట్ నిరాకరించింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేయడంతో.. సీనియర్ నేత వంగా గీతను పోటీ చేయించారు.

అయినా సరే దొరబాబు వైఎస్సార్‌సీపీలోనే కొనసాగారు.. గీత గెలుపు కోసం పనిచేశారు. 2024 ఎన్నికల ఫలితాల తర్వాత దొరబాబు వైఎస్సార్‌సీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.. వైఎస్ జగన్ ఢిల్లీ ధర్నాకు హాజరుకాలేదు. అంతకు కొద్ది రోజుల ముందు నుంచే దొరబాబు పార్టీ మారబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. దొరబాబు తన రాజీనామాపై ఒకటి, రెండు రోజుల్లో అధికారిక ప్రకటన చేస్తారని తెలుస్తోంది.

Tags

Next Story