ఏపీలో ముగిసిన నాలుగో దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్
ఏపీలో పంచాయతీ ఎన్నికల పోలింగ్ తుది దశకు చేరుకుంది. నాలుగో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. మధ్యాహ్నం మూడున్నర గంటలకు రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ పూర్తయింది. చెరుదుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మూడున్నర లోపు క్యూలైన్‌లో ఉన్నవారికి మాత్రమే ఓటు వేసేందుకు అధికారులు అనుమతిచ్చారు. మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా 78.90శాతం పైగా పోలింగ్ నమోదైందని అధికారులు వెల్లడించారు. అత్యధికంగా విజయనగరం జిల్లాలో 85శాతానికి పైగా పోలింగ్ నమోదవగా.. అత్యల్పంగా నెల్లూరులో 73.20శాతం పోలింగ్ నమోదైంది.
ఇక ఆఖరి దశలో 3వేల 299 పంచాయతీలకు ఎన్నికలు జరగ్గా.. ఇప్పటికే 554 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. కడప జిల్లాలో రెండు చోట్ల నామినేషన్ వేయకపోవడంతో 2వేల 743 పంచాయతీలకు పోలింగ్ జరుగనుంది. 7వేల 475 మంది అభ్యర్ధులు బరిలో నిలిచారు. ఇక 33 వేల 435 వార్డుల్లో 10వేల 921 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. 91 వార్డులకు నామినేషన్లు పడలేదు. దీంతో 22 వేల 423 వార్డుల్లో పోలింగ్ జరుగనుంది. వీటికి 52వేల 7వందల మంది బరిలో నిలిచారు. మరికొన్ని గంటల్లో అభ్యర్థుల భవితవ్యం తేలనుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com