Free Gas Cylinder : ఏపీలో దీపావళి కానుకగా ఉచిత గ్యాస్ సిలిండర్లు

Free Gas Cylinder : ఏపీలో దీపావళి కానుకగా ఉచిత గ్యాస్ సిలిండర్లు
X

దీపావళి నుంచి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్ల పథకం అమలు చేస్తామన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. రానున్న సంక్రాంతి నుంచి రైతు భరోసా అందజేస్తామని తెలిపారు. శ్రీకాకుళం రూరల్ మండలం కుందువానిపేట గ్రామంలో పొలం పిలుస్తుంది కార్యక్రమంలో.. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తో కలిసి పాల్గొన్నారు. వెంటిలేటర్ మీద ఉన్న ప్రభుత్వం.. కేంద్ర సహాయం వల్ల ఆక్సిజన్ తీసుకునే వెసులుబాటు కల్పించిందని చెప్పారు అచ్చెన్నాయుడు. భోగాపురం ఎయిర్ పోర్టు, మూలపేట పోర్ట్, శ్రీకాకుళం జిల్లాలో మరొక ఎయిర్పోర్ట్ వలన ఉద్యోగ ఉపాధి రంగాల్లో తోడ్పాటు అందిస్తామని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు.మత్స్యకారులకు అండగా ఉంటామని రామ్మోహన్ నాయుడు అన్నారు.

Tags

Next Story