Cylinders Free : దీపావళికి ఉచిత సిలిండర్ల పథకం

Cylinders Free : దీపావళికి ఉచిత సిలిండర్ల పథకం
X

వచ్చే దీపావళి నాటికి మహిళలకు కానుక ఇవ్వాలనే అంశంపై బుధవారం మంత్రి వర్గ సమావేశంలో చర్చ జరిగింది.. ఉచిత వంట గ్యాస్ అందిద్దామా..? లేక మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పిద్దామా..? అనే అంశంపై సీఎం చంద్రబాబు మంత్రులు అభిప్రాయం తీసుకున్నారు. ఏడాదికి మూడు ఉచిత వంట గ్యాస్ సిలిండర్లను ఇచ్చే పథకం వైపే మెజార్టీ మంత్రులు మొగ్గు చూపారని సమా చారం. వాలంటీర్ల వ్యవస్థ పునరుద్ధరణపై చర్చ జరిగింది. దీనిపై మరింత సమాచారం తీసుకోవాలనే అభిప్రాయం వ్యక్తమైంది.

కౌలు రైతులకు పంట నష్టపరిహారం ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో వరదల వల్ల ఇతర ప్రాంతాల్లో నష్టపోయిన ప్రతి కుటుంబానికి రూ.10 వేలు ఇవ్వనుంది. గతంలో కేవలం రూ.2 వేలు ఇచ్చే వారు, ఇప్పుడు దాన్ని రూ.10 వేలకు పెంచనున్నారు. గత ప్రభుత్వం సాక్షి పత్రిక కొనుగోళ్లల్లో చేసిన అవకతవకలపై చర్చ జరిగింది. రెండేళ్లల్లోనే సాక్షి పత్రిక కొనుగోళ్ల కోసం ప్రభుత్వ ఖజానా నుంచి రూ. 205 కోట్లు ఖర్చు చేశారని సీఎం చంద్రబాబు దృష్టికి మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి తెచ్చారు.

నిబంధనలకు విరుద్ధంగా సాక్షికి జరిపిన చెల్లింపులపై విచారణకు ఆదేశిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. నెల నెలా ఇస్తున్న రూ.200ను రద్దు చేశారు. ఆ పత్రిక సర్కులేషన్ ఎంతుంది? ఏ నిబంధనల ప్రకారం కొనుగోళ్లకు నిధులు కేటాయించారనే దాని పైనా విచారణ చేయాలని పలువురు మంత్రులు కోరారు.

Tags

Next Story