Andhra Pradesh : జనవరి 1 నుంచి ఇంటర్ విద్యార్థులకు ఉచిత భోజనం

Andhra Pradesh : జనవరి 1 నుంచి ఇంటర్ విద్యార్థులకు ఉచిత భోజనం
X

ప్రభుత్వ జూనియర్ కాలేజీలకు మధ్యాహ్న భోజనం అమలుపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. జనవరి 1 నుంచి దీన్ని ప్రారంభించాలని నిర్ణయించింది. దీని ద్వారా దాదాపు 1.20 లక్షల మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఉచితంగా అందనుంది. రేపు జరిగే క్యాబినెట్ సమావేశంలో దీనికి ఆమోదం లభించే ఛాన్సుంది. కాగా ప్రస్తుతం 45 వేల ప్రభుత్వ స్కూళ్లల్లో మాత్రమే డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అమల్లో ఉంది.

అటు గత అయిదేళ్లలో ఇంటర్‌ ఫలితాలు దారుణంగా పడిపోయాయి. డ్రాపౌట్లు కూడా పెరిగాయి. విద్యార్థుల హాజరుతో పాటు ఉత్తీర్ణత పెంచే విషయమై మంత్రి లోకేశ్‌ దృష్టి సారించారు. డ్రాపౌట్స్‌తో పాటు పౌష్టికాహార లోపాన్ని తగ్గించేందుకు మధ్యాహ్న భోజన పథకాన్ని త్వరలో అమలు చేయనున్నారు.

టీడీపీ ప్రభుత్వం ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేసింది. ఉచిత పాఠ్య పుస్తకాలు అందజేసింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వీటిని పక్కనపెట్టింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇంటర్‌ విద్యార్థులకు తీపి కబురు అందించింది. పాఠ్య, రాత పుస్తకాలు, సంచులు పంపిణీ చేసింది. సంకల్ప్‌ పేరుతో కేర్‌ టేకర్లను నియమించి ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. తాజాగా మధ్యాహ్న భోజనం అమలుకు చర్యలు తీసుకుంది.

Tags

Next Story