AP : నవంబర్ రెండో వారంలో ఏపీలో పూర్తిస్థాయి బడ్జెట్

AP : నవంబర్ రెండో వారంలో ఏపీలో పూర్తిస్థాయి బడ్జెట్
X

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. నవంబరు రెండో వారంలో పూర్తిస్థాయి బడ్జెట్ ను ప్రవేశ పెట్టేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. సూపర్ సిక్స్ పథకాల అమలుకు బడ్జెట్లో పెద్ద ఎత్తున నిధులు కేటాయించేలా నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఈ నెల 23న ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో ఉదయం 11 గంటలకు కేబినెట్ భేటీకానుంది. వివిధ శాఖలకు సంబంధించిన ప్రతి పాదనలను ఈ నెల 21వ తేదీన సాయంత్రం 4 గంటల వరకు పంపించాలంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ అన్ని శాఖల కార్యదర్శులకు లేఖ రాశారు.

Tags

Next Story