గాజువాక అత్యాచార ఘటనపై టీడీపీ నిజ నిర్ధారణ కమిటీ ఏర్పాటు
గాజువాక అత్యాచార ఘటనపై.. నిజ నిర్ధారణ కమిటీ ఏర్పాటు చేశామన్నారు ఏపీ టీడీపీ అధ్యక్షులు కళా వెంకటరావు. నిజ నిర్ధారణ కమిటీలో.. రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనితతోపాటు పుచ్చా విజయ్ కుమార్, ఇతలపాక సుజాత, బడుమురి గోవిందులు సభ్యులుగా ఉంటరాన్నారు. అత్యాచార సంఘటనల్లో నిందితులను రక్షించేందుకు వైసీపీ నేతలు ప్రయత్నించడం దుర్మార్గమన్నారు. అత్యాచార సంఘటనలపై దేశవ్యాప్తంగా ప్రజలు నిరసనలు తెలుపుతుంటే... వైసీసీ నేతలు నిందితుల్ని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ను అరాచక పాలనకు అడ్డాగా మార్చారన్నారు కళా వెంకటరావు. దిశా చట్టం కింద ఎంతమందిని శిక్షించారని ఆయన ప్రశ్నించారు. దళితులపై దాడులు, మహిళలపై అకృత్యాలు గణనీయంగా పెరుగుతున్నా ముఖ్యమంత్రికి చీమ కుట్టినట్టు కూడా లేదన్నారు.
మహిళలపై దాడులు దేశంలో అత్యధికంగా ఆంధ్రప్రదేశ్ లో చోటు చేసుకుంటున్నాయని... 29.3 శాతం పైగా నేరాలు ఆంధ్రప్రదేశ్‌లోనే జరుగుతున్నాయని కళా వెంకటరావు ఆందోళన వ్యక్తం చేశారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com