Bhadrachalam : భద్రాచలం వద్ద గోదావరి మరో ప్రమాద హెచ్చరిక

Bhadrachalam : భద్రాచలం వద్ద గోదావరి మరో ప్రమాద హెచ్చరిక
X

భద్రాచలం వద్ద గోదావరి నది ఉదృతంగా ప్రవహిస్తోంది. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ అయింది. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 48 అడుగులకు చేరింది. ఈ నేపథ్యంలో అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు.

ఆదివారం రాత్రి భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం 44 అడుగులు దాటడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీచేసింది. సోమవారం ఉదయం 46 అడుగుల వద్ద ప్రవహించింది. మధ్యాహ్నం 2 గంటల సమయానికి 48 అడుగులు చేరడంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అయితే ఎగువన ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో నది ఉగ్రరూపం దాల్చింది.

సాయంత్రం నాటికి నదీ ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉన్నదని అధికారులు వెల్లడించారు.

Tags

Next Story