AP : మైనార్టీ విద్యార్థులకు గుడ్ న్యూస్ .. ఫీజ్ రీయింబర్స్‌మెంట్ నిధుల విడుదల

AP : మైనార్టీ విద్యార్థులకు గుడ్ న్యూస్ .. ఫీజ్ రీయింబర్స్‌మెంట్ నిధుల విడుదల
X

మైనార్టీ విద్యార్థులకు 2024-25 విద్యా సంవత్సరానికి ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల అయ్యాయి. రూ.40.22కోట్ల ట్యూషన్ ఫీజు ప్రభుత్వం విడుదల చేసినట్లు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఫరూక్ ఒక ప్రకటనలో వెల్లడించారు. ముస్లిం మైనార్టీ స్టూడెంట్స్‌కు రూ.37.88కోట్లు, క్రిస్టియన్ మైనార్టీలకు రూ.2.34కోట్లు మంజూరైనట్లు ఆయన తెలిపారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా క్లస్టర్‌ పాఠశాలల సమావేశాలకుకు సంబంధించి సమగ్ర శిక్షా అభియాన్‌ నిధుల్ని విడుదల చేసింంది. రవాణా భత్యం, నిర్వహణ ఖర్చుల నిమిత్తం మొత్తం రూ.28.09 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు వచ్చేశాయి. రాష్ట్రవ్యాప్తంగా 2,809 క్లస్టర్లు ఉంటే.. ఒక్కోదానికి రూ.లక్ష చొప్పున ప్రభుత్వం కేటాయించింది. ప్రభుత్వం విడుదల చేసిన ఈ నిధుల్లోంచి నిర్వహణకు రూ.30వేలు, బోధన, అభ్యసన మెటీరియల్‌కు రూ.25వేలు, ఇతర ఖర్చులకు రూ.35వేలు, రవాణా భత్యానికి రూ.10వేలు చొప్పున వ్యయానికి అనుమతి ఇచ్చింది ప్రభుత్వం.

Tags

Next Story