AP Government : ఎన్టీఆర్ మూవీకి గుడ్ న్యూస్.. టికెట్ల పెంపుకు ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్

వార్ 2 చిత్ర యూనిట్‌కి గుడ్ న్యూస్ చెప్పింది ఏపీ ప్రభుత్వం. ఆగస్టు 14 న ప్రపంచ వ్యాప్తంగా ఐదు భాషల్లో ఈ సినిమా గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ క్రమంలో రాష్ట్రంలో సినిమా టికెట్ల రేట్లు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది ప్రభుత్వం. ఇందుకు సంబంధించి అధికారిక ఉత్తర్వులు కూడా జారీ చేసింది. సినిమా విడుదల రోజు నుండి 23/08/2025 వరకు మల్టీప్లెక్స్ లో రూ.100, సింగిల్ స్క్రీన్స్లో రూ.75 టికెట్ రేట్స్ పెంచుకునేందుకు అనుమతులు మంజూరు చేశారు. ఇక ఈ అంశం పై సోషల్ మీడియా వేదికగా స్పందించారు జూనియర్ ఎన్టీఆర్. టిక్కెట్ల రెట్ల పెంపుకు అనుమతి ఇవ్వడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తో పాటు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్ కు ధన్యవాదాలు తెలిపారు. బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉంది చిత్ర యూనిట్.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com