Jagan : గూగుల్ డేటా సెంటర్.. మాట మార్చేసిన జగన్..

అసలు ఏపీలో వైసీపీకి ఏం మాట్లాడాలో.. దేనిపై ఎలా ముందుకు వెళ్లాలో కూడా అర్థం కావట్లేదు. ముందుగా ఏదో ఒకటి అబద్ధాలు చెప్పేసి జనాలను నమ్మించేయాలని.. కూటమి ప్రభుత్వంపై బురద జల్లేయడానికి రెడీగా ఉంటుంది. తీరా అది బోల్తా కొట్టి ప్రజలు ఛీ కొట్టే దాకా వస్తే.. అప్పుడు ప్లేట్ ఫిరాయించి దాని క్రెడిట్ కొట్టేయడానికి ట్రై చేస్తుంది. ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ విషయంలోనూ ఇలాగే చేస్తుంది వైసిపి పార్టీ. విశాఖకు గూగుల్ డేటా సెంటర్ వస్తుంది అని తెలిసినప్పుడు.. వైసిపి ఎన్ని రకాల తప్పుడు ప్రచారాలు చేసిందో మనం చూశాం. గూగుల్ డేటా సెంటర్ అంటే ఒక గోడౌన్ అని.. అక్కడ వాచ్మెన్ ఒక్కడే ఉంటాడు తప్ప ఎవరికి ఉద్యోగాలు రావు అని.. విపరీతంగా కరెంటు ఖర్చు అవుతుందని.. భారీగా నీళ్లు కావాలి కాబట్టి చెరువులన్నీ ఎండిపోతాయని.. వాతావరణం మొత్తం పొల్యూట్ అవుతుందని ఇలా ఎన్నో అబద్ధాలు చెప్పింది. కానీ గూగుల్ డేటా సెంటర్ ప్రాముఖ్యత గురించి ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీ సైతం చెప్పడం, దాని ఘనత గురించి దేశమంతా చర్చించుకోవడంతో వైసిపి నోరెళ్లబెట్టింది. దీంతో ఇప్పుడు క్రెడిట్ కొట్టేయడానికి జగన్ ఓ స్క్రిప్ట్ రెడీ చేసుకున్నారు.
నిన్న ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.. గూగుల్ డేటా సెంటర్ ను తెచ్చిందే తాను అని.. ఆ క్రెడిట్ తనదే అని ప్లేట్ ఫిరాయించారు. తాను సీఎంగా ఉన్నప్పుడే 2019లో అదాని గ్రూప్ సంస్థతో ఒప్పందం చేసుకొని.. డేటా సెంటర్ ను ఏర్పాటు చేయడానికి ఒప్పందం జరిగిందని చెప్పారు. ఆదానీతో గూగుల్ కు లింక్ ఉండటంవల్ల అదాని వల్ల గూగుల్ డేటా సెంటర్ వస్తోందని.. ఆ క్రెడిట్ అదానికి, వైసీపీ పార్టీకి ఇవ్వాలని వేడుకుంటున్నాడు. ఇది చూసిన ఏపీ ప్రజలు షాక్ అవుతున్నారు. ఇదే వైసీపీ నేతలు కదా మొన్నటిదాకా గూగుల్ డేటా సెంటర్ వల్ల ఎలాంటి లాభం లేదు.. పర్యావరణం పాడవుతుంది అంటూ రకరకాల ప్రచారాలు చేశారు. మరి జగన్ ఏంటి అది గొప్ప డేటా సెంటర్ అని.. దానివల్ల చాలా రకాల ఉద్యోగాలు వస్తాయి అని ఇలా ఎందుకు చెబుతున్నారని.. ఇలా అబద్ధాలు చెప్పడంలో వీళ్లను మించిన వాళ్లే లేరు అని ప్రజలు ఛీ కొడుతున్నారు.
కానీ ఇదే అదాని డేటా సెంటర్ కు శంకుస్థాపన చేసింది 2019 ఫిబ్రవరిలో చంద్రబాబు నాయుడు సీఎం గా ఉన్నప్పుడే. అప్పుడు కేవలం అదానీ డేటా సెంటర్ కోసం మాత్రమే ఎంఓయూ జరిగింది. ఆ తర్వాత ఎలక్షన్లు వచ్చి వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత డిలే చేసింది. 2023లో 33 వేల కోట్లతో ఆదానికి జగన్ ప్రభుత్వానికి ఒక ఎంఓయు కుదిరింది. కానీ అది కూడా ముందు పడలేదు. వైసీపీ ఆగడాలు చూసి ఆదాని డేటా సెంటర్ ఏపీకి రాలేదు.
అది అప్పుడే ఆగిపోయింది. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు నాయుడు పదేపదే కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి గూగుల్ డేటా సెంటర్ కోసం శ్రమించి.. మంత్రి నారా లోకేష్ స్వయంగా గూగుల్ మెయిన్ ఆఫీస్ కు వెళ్లి విశాఖకు గూగుల్ డేటా సెంటర్ను తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు. 87 వేల కోట్ల పెట్టుబడితో గూగుల్ డేటా సెంటర్ విశాఖకు రాబోతోంది. కానీ జగన్ మాత్రం క్రెడిట్ కొట్టేయడానికి రెడీ అయిపోయాడు. చంద్రబాబు నాయుడు క్రెడిట్ ఇవ్వాలని జగన్ కోరడం చాలా కామెడీగా ఉంది. ఎందుకంటే ముందు గూగుల్ డేటా సెంటర్ పేరు రకరకాల తప్పుడు ప్రచారాలు చేసి.. ఇప్పుడు అదే గొప్ప సంస్థ అని జగన్ రెండు నాలుకల ధోరణి బయట పెట్టడంతో ప్రజలు తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

